Breaking News

ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు

Published on Fri, 07/21/2023 - 15:02

కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం, పనితీరు బాగా లేదు అనుకున్న వాళ్లని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా కామన్‌. కానీ ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు  గుణపాఠం  చెప్పే పేరుతో టాప్‌  పెర్ఫార్మర్‌నే ఉద్యోగంలోంచి తీసేసింది. దీనికి సంబంధించిన కథనం  సోషల్‌మీడియాలో  వైరల్‌గా మారింది.  (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్‌: మురిసిపోతున్న కాబోయే కోడలు)

సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌ ఒక  యూజర్‌ ఈ స్టోరీని షేర్‌ చేశాడు.  కంపెనీలో బాగా పని చేసే టాప్ పెర్ఫార్మర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని రెడిట్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదెక్కడి చోద్యం రా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకు బాగా పనిచేస్తున్న  ఉద్యోగిని తీసివేయడం ఎంతవరకు సబబు అంటూ  నెటిజన్లు మండిపడుతున్నారు. (సినిమాలకు బ్రేక్‌: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?)

అంతేకాదు  కంపెనీకి సంబంధించి తర విషయాల గురించి కూడా చెప్పాడు. కార్మికుల  కమీషన్లు దొంగిలించడం, కాంట్రాక్ట్ నిబంధనలను బేఖాతరు చేయడం,  కనీసం వాష్‌రూంలో 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపినా  వేధించడం, నచ్చకపోతే తలుపు తెరిచి ఉందని చెప్పడం లాంటివి చాలా వరకు తగ్గాయంటూ వీటి తీవ్రతను చెప్పుకొచ్చాడు రెడిటర్ పోస్ట్‌లో తెలిపారు.

టార్గెట్‌ రీచ్ అవ్వని కారణంగా తొలగిస్తామని బెదిరించారు. నిజానికి నానుంచి కమీషన్‌ తీసుకున్నందుకు  చేసిన పని అది. ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా టాప్ పెర్ఫార్మర్ అయినా తన సహో ద్యోగిని  తొలగించారనీ వాపోయాడు. అంతేకాద సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో  అంచనాలను అందుకోలేదని వారు చెప్పారు.  కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే తమను ప్రశ్నించిన వారిక ఇలాటి గతే పడుతుందని  ఇతర  ఉద్యోగులకు ఇది పరోక్ష హెచ్చరిక అని కమెంట్‌ చేశారు.కమీషన్ కాంట్రాక్ట్ ఒప్పందాలను  ఉల్లంఘిండం లాంటి విషయాలపై  ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందనే మెసేజ్‌ను డైరెక్ట్ మేనేజర్  ఇచ్చారని రెడిట్ పోస్టులో రాసుకొచ్చారు ఆ కంపెనీ ఉద్యోగి. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)