Breaking News

హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..

Published on Thu, 02/27/2025 - 07:32

హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల ధరలు గత అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 2 శాతం పెరిగినట్టు క్రెడాయ్‌–కొలియర్స్‌–లైసస్‌ ఫొరాస్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్‌–8 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 10 శాతం పెరగ్గా.. అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 31 శాతం ఎగసినట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. బలమైన డిమాండ్‌కుతోడు అధిక నిర్మాణ వ్యయాలు ధరలు పెరగడానికి దారితీసినట్టు పేర్కొంది. వరుసగా 16వ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. విశాలమైన ఇళ్లు, మెరుగైన జీవనశైలికి ప్రాధాన్యం వంటివి హౌసింగ్‌ డిమాండ్‌ను పెంచినట్టు క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ తెలిపారు. నిర్మాణ వ్యయాలు, భూమి కొనుగోలు ధరలు పెరగడం ధరలకు ఆజ్యం పోసినట్టు చెప్పారు.  

రేట్ల తగ్గింపుతో విక్రయాలకు ఊతం

టాప్‌–8 నగరాల్లో ఈ ఏడాది కూడా ఇళ్ల ధరలు పెరుగుతాయని కొలియర్స్‌ ఇండియా సీఈవో బాదల్‌ యాగ్నిక్‌ అంచనా వేశారు. ‘రానున్న రోజుల్లో బెంచ్‌మార్క్‌ రుణ రేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి. దీంతో చాలా పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చు. దీంతో ఇళ్ల ధరలు గతంలో మాదిరే 2025లోనూ పెరిగే అవకాశం ఉంది’ అని యాగ్నిక్‌ వివరించారు. అందుబాటు ధరల ఇళ్లు, మధ్యస్థ ధరల విభాగంలో ఇళ్ల సరఫరా, విక్రయాలు రానున్న రోజుల్లో పెరగొచ్చని లైసస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ అంచనా వేశారు. డిసెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయని, కొత్త ఇళ్ల ఆవిష్కరణ మోస్తరుగా ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లు

పట్టణాల వారీగా ధరల పెరుగుదల

  • హైదరాబాద్‌లో 2024 అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇళ్ల ధరలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగాయి. చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ.11,351కి చేరింది.  

  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎస్‌ఎఫ్‌టీ ధర 31 శాతం ఎగసి రూ.11,993కు చేరింది.  

  • బెంగళూరులో 23 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.12,238గా ఉంది.  

  • అహ్మదాబాద్‌లో ధరలు 15 శాతం పెరగడంతో చదరపు అడుగు రూ.7,725కు చేరింది.  

  • చెన్నైలో 6 శాతం వృద్ధితో ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.8,141గా ఉంది.

  • ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో ధరలు 3 శాతం పెరగడంతో ఎస్‌ఎఫ్‌టీ రూ.20,725కు చేరింది.  

  • పుణెలో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. ఎస్‌ఎఫ్‌టీ రూ.9,982గా నమోదైంది.  

  • కోల్‌కతాలో అతి తక్కువగా ఒక శాతం ధర పెరగడంతో ఎస్‌ఎఫ్‌టీ రూ.7,971కి చేరింది.
     

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)