ఐటీ కంపెనీ బంపరాఫర్: ఉద్యోగులకు రూ.14.5 కోట్ల బోనస్

Published on Fri, 02/07/2025 - 14:42

దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు భారీ లాభాలను పొందినప్పటికీ.. ఉద్యోగులను తొలగించడం, జీతాలు పెంచకపోవడం వంటివి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్ల బోనస్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కోయంబత్తూరుకు చెందిన 'కోవై.కో' అనే కంపెనీ.. సంస్థలో మూడేళ్ళుగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు 'టుగెదర్ వి గ్రో' చొరవ కింద రూ.14.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ బోనస్‌ను డిసెంబర్ 31, 2022 నాటికి కంపెనీలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు వారి వార్షిక జీతంలో 50% బోనస్ పొందుతారు. ఇది వారి కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇప్పటికే మొదటి దశలో 80 మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే వారి జనవరి జీత చెల్లింపులలో భాగంగా బోనస్‌లను అందుకున్నారు.

కంపెనీ వృద్ధికి, విజయానికి సహాయపడే ఉద్యోగులకు.. సంస్థ పొందిన లాభాలలో వాటా ఇవ్వడం నా కల. అందుకే ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తున్నట్లు కోవై.కో వ్యవస్థాపకుడు.. సీఈఓ శరవణ కుమార్ అన్నారు. 2023లో కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది. బెంగళూరుకు చెందిన ఫ్లోయిక్‌ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ఎన్ని కొట్లో తెలుసా?

ఉద్యోగులకు షేర్ రూపంలో ఇవ్వడం కంటే.. నగదు రూపంలో డబ్బు ఇవ్వడం వల్ల వారి ప్రయోజనాలను ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్స్ చెల్లించడానికి లేదా ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బోనస్‌ను నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు శరవణ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తాము ఊహించినదానికంటే ఎక్కువ బోనస్ ఇచ్చినందులు ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)