Breaking News

విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్

Published on Wed, 06/25/2025 - 13:23

ఐటీ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ తన భారత కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వైజాగ్‌లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 22 ఎకరాల్లో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్యాంపస్‌ ద్వారా 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది.

2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా తాత్కాలిక కేంద్రం ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్‌ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్‌.రవి కుమార్ తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా వైజాగ్‌లో క్యాంపస్‌ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని, అదే సమయంలో భవిష్యత్తులో శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుతుందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం

భారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్‌ ఇప్పటికే భువనేశ్వర్, ఇండోర్‌లో కొత్త కేంద్రాలను, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్‌ హబ్‌ను ఏర్పాటు చేసిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా కంపెనీ శ్రామిక శక్తి భారత్‌లో ఉన్నందున కాగ్నిజెంట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.

#

Tags : 1

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)