Breaking News

కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు

Published on Wed, 04/19/2023 - 22:01

కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపును అందిస్తోంది. 18 నెలల్లో ఇది మూడవ వేతన పెంపు. పెరుగుతున్న అట్రిషన్ కంపెనీకి తలనొప్పిగా మారింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా కంపెనీ షెడ్యూల్‌ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది.

(apple saket: యాపిల్‌ ఢిల్లీ స్టోర్‌ ఫస్ట్‌ లుక్‌.. అదిరిపోయింది!)

వేతన పెంపునకు సంబంధించిన లెటర్లను ఉద్యోగులు ఈ వారంలో అందుకుంటారని కంపెనీ వారికి పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది.  సంవత్సరాంతపు పనితీరు సమీక్షలను అనుసరించి ఆరు నెలల ముందుగానే ఈ మెరిట్ పెంపును అందిస్తున్నామని, 18 నెలల్లో ఇది మూడో మెరిట్ పెరుగుదల అని కంపెనీ సీఈవో రవికుమార్‌ వివరించారు. జనవరిలో డైరెక్టర్లు అంతకంటే పైస్థాయివారికి ఇచ్చిన పెంపుతో కలిపి 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు వేతన పెంపును అందుకుంటున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు నిరంతర శిక్షణ, నైపుణ్యం, వృత్తిపరమైన అభివృద్ధిలో కంపెనీ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు.

కాగా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అమలు చేస్తున్న ఈ వేతన పెంపు కంపెనీ  వన్-టైమ్ టూ-మెరిట్ సైకిల్ పెంపులో భాగం. ఈ వేతన పెంపును గత సంవత్సరమే ప్రకటించారు. 2022 అక్టోబర్‌లో, ఆపై 2023 ఏప్రిల్‌లో వేతన పెంపుదల ఉంటుందని కంపెనీ గతంలోనే పేర్కొంది.

ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్‌..

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)