Breaking News

పడిపోయిన టాప్‌ ఐటీ కంపెనీ లాభాలు

Published on Thu, 10/30/2025 - 18:26

దేశీయంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ3)లో యూఎస్‌ కంపెనీ నికర లాభం 53 శాతం క్షీణించి 27.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ కాలంలో 39 కోట్ల డాలర్లమేర నగదేతర ఆదాయ పన్ను వ్యయాల కారణంగా లాభాలు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది.

గతేడాది(2024) క్యూ3లో 58.2 కోట్ల డాలర్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 7 శాతంపైగా ఎగసి 541.5 కోట్ల డాలర్లను తాకింది. ఏఐలో పెట్టుబడులు ఇందుకు సహకరించగా.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను తాజాగా మెరుగుపరచింది. వెరసి ఇంతక్రితం ప్రకటించిన 20.7–21.1 బిలియన్‌ డాలర్లను 21.05–21.1 బిలియన్‌ డాలర్లకు సవరించింది. కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే.

ఈ బాటలో చివరి త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)లో 5.27–5.33 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ క్యూ3లో ఆర్డర్ల బుకింగ్స్‌ 5 శాతం నీరసించగా.. 6,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,49,800ను తాకింది. ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించే బాటలో సాగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)