Breaking News

ఆ తక్కువ జీతం ఐటీ వాళ్లకు కాదు: కాగ్నిజెంట్‌ క్లారిటీ

Published on Sun, 08/18/2024 - 16:12

ఫ్రెషర్లకు అత్యల్పంగా రూ. 2.52 లక్షల వార్షిక జీతం ఆఫర్‌ చేసినట్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ దానిపై స్పష్టత ఇచ్చింది. ఆ వేతనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు కాదని, సాధారణ డిగ్రీ హోల్డర్‌లకు మాత్రమేనని తాజాగా పేర్కొంది.

తాము ఫ్రెష్‌ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు రూ. 4-12 లక్షల వేతనాన్ని అందిస్తున్నట్లు కాగ్నిజెంట్‌ వివరణ ఇచ్చింది. దీంతోపాటు తమ సంస్థలో ఉద్యోగులకు శాలరీ హైక్‌ మరీ తక్కువగా 1 శాతమే ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎగతాళిపైనా కాగ్నిజెంట్‌ స్పందించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్‌లలో  1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్‌ అని వివరించింది.

కాగ్నిజెంట్ ఏటా ఇంజనీరింగ్‌, నాన్-ఇంజనీరింగ్/ఐటీ గ్రాడ్యుయేట్‌ ఫ్రెషర్‌లను విభిన్న పాత్రల కోసం నియమించుకుంటుంది. ఈ రెండు రిక్రూట్‌మెంట్‌లు దాదాపు సమాంతరంగా నడుస్తుండటంతో మూడేళ్ల నాన్-ఇంజనీరింగ్/ఐటీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్‌ల నియామకానికి సంబంధించిన ఫ్రెషర్‌ల శాలరీ ప్యాకేజీ సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అయింది.

"నాన్‌ ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి 3-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ప్రతిభావంతుల కోసం చేసిన మా ఇటీవలి జాబ్‌ పోస్టింగ్ వక్రీకరణకు గురైంది. ఈ జాబ్ పోస్టింగ్‌లో ఉన్న రూ. 2.52 లక్షల వార్షిక పరిహారం మూడేళ్ల సాధారణ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం  కాదు. ఫ్రెష్‌ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు మా వార్షిక పరిహారం హైరింగ్, స్కిల్ సెట్, అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్‌ల కేటగిరీని బట్టి సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది" అని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)