Breaking News

జేఏఎల్‌ దివాలా పరిష్కార  ప్రణాళికకు డెడ్‌లైన్‌ పొడిగింపు

Published on Sat, 06/14/2025 - 04:58

న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న జైప్రకాష్‌ అసోసియేట్స్‌ (జేఏఎల్‌) పరిష్కార ప్రణాళిక దాఖలుకు ఆఖరు తేదీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జూన్‌ 24కి పొడిగించాయి. బిడ్డర్ల విజ్ఞప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఖరు తేదీ పొడిగింపును రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించినట్లు జేఏఎల్‌ తెలిపింది. 

వాస్తవానికి ఈ గడువు జూన్‌ 9తో ముగియాలి. అయితే, పలువురు బిడ్డర్లు పరిష్కార ప్రణాళికను సమరి్పంచేందుకు మరింత గడువు కావాలని కోరడంతో సీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. సుమారు 25 కంపెనీలు జేఏఎల్‌ను దక్కించుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, వేదాంత, పతంజలి ఆయుర్వేద, జీఎంఆర్‌ బిజినెస్‌ అండ్‌ కన్సల్టెన్సీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.

 రియల్‌ ఎస్టేట్, సిమెంట్‌ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో జేఏఎల్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌ కావడంతో 2024 జూన్‌ 3న కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) విచారణ చేపట్టింది. కంపెనీకి మొత్తం రూ. 57,185 కోట్ల మేర రుణభారం ఉంది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)