Breaking News

బొగ్గు గనుల కోసం పోటా పోటీ

Published on Thu, 06/29/2023 - 13:29

న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలానికి భారీ స్పందన కనిపించింది. ఏడో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 103 బ్లాకులను ఆఫర్‌ చేసింది. 18 బొగ్గు గనులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కలసి 35 బిడ్లు దాఖలైనట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి టెక్నికల్‌ బిడ్లను బుధవారం తెరిచారు.

ఎన్‌టీపీసీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, జేఎస్‌పీఎల్‌ తదితర 22 కంపెనీలు వేలంలో పోటీ పడుతున్నాయి. 18 బొగ్గు గనుల్లో 9 పాక్షికంగా బొగ్గు అన్వేషించినవి. మిగిలిన గనుల్లో అన్వేషణ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. వీటి ద్వారా ఏటా 51.80 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చు.

17 నాన్‌ కోకింగ్‌ కోల్‌ కాగా, ఒకటి కోకింగ్‌ కోల్‌మైన్‌. జేఎస్‌పీఎల్, ఎన్‌ఎల్‌సీ ఇండియా, బజ్‌రంగ్‌ పవర్‌ అండ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్, గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జీఎండీసీ), బుల్‌ మైనింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఒక్కోటీ మూడు బ్లాకులకు బిడ్లు వేశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ మైనింగ్, సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఒక్కోటీ రెండు కోల్‌ బ్లాక్‌ల కోసం పోటీ పడుతున్నాయి. నల్వా స్టీల్‌ అండ్‌ పవర్, నువోకో విస్టాస్‌ కార్ప్, ఒడిశా కోల్‌ అండ్‌ పవర్‌ తదితర 14 కంపెనీలు ఒక్కో బ్లాక్‌ కోసం బిడ్లు దాఖలు చేశాయి. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)