Breaking News

ఒక్కసారిగా పెరిగిన సీఎన్‌జీ ధరలు..

Published on Mon, 11/25/2024 - 16:35

సాధారణంగా పెట్రోల్, డీజల్ ధరలే ప్రజలకు షాకిస్తుంటాయి. కానీ ఇప్పుడు సీఎన్‌జీ ధరలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. కేజీ సీఎన్‌జీ ధర ఉన్నట్టుండి.. ఏకంగా రెండు రూపాయల పెరిగింది.

ముంబైతో పాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు పెరిగాయి. అయితే ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు పెరగలేదని సమాచారం. దీనికి కారణం దేశ రాజధానిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అని తెలుస్తోంది. కాబట్టి ఢిల్లీలో కేజీ సీఎన్‌జీ ధర రూ. 75.09 వద్ద ఉంది.

ధరల పెరుగుదల తరువాత ముంబైలో కేజీ సీఎన్‌జీ 77 రూపాయలు దాటేసింది. నోయిడా, ఘజియాబాద్‌లలో కేజీ సీఎన్‌జీ ధరలు వరుసగా రూ. 81.70, రూ. 82.12గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీతో పోలిస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో సీఎన్‌జీ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

ఎన్నికలు ముగియడంతో.. ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబై, పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలను కిలోపై రూ. 2 చొప్పున పెంచినట్లు వెల్లడించింది. గత రెండు నెలలుగా ధరలను పెంచని అదానీ టోటన్ గ్యాస్ కూడా సీఎన్‌జీ రేటును పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ ధర రూ. 96వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్‌లోనే సీఎన్‌జీ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)