Breaking News

బీమా రంగంపై ఆపోహలు.. వాస్తవాలు

Published on Wed, 01/29/2025 - 14:58

లక్షలాది మంది పౌరులను, అనేక వ్యాపారాలను రక్షిస్తున్న బీమా పరిశ్రమ తరచూ విమర్శలను ఎదుర్కొంటుందని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, బజాజ్‌ అలియన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. చాలామంది బీమా కంపెనీలు కేవలం లాభాల కోసమేననే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఈ రంగంపై ఉన్న అపోహలు, వాస్తవాలపై ప్రజలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. తపన్‌ సింఘాల్‌ బీమా రంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని గణాంకాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఐఆర్‌డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ రూ.1.72 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇందులో రూ.80,000 కోట్లకు పైగా ఆరోగ్య బీమాకు చెల్లించిందే. క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ నిష్పత్తి 80% కంటే ఎక్కువే. తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల్లో 20% తరచుగా మోసపూరితమైన లేదా ఆమోదయోగ్యం కాని విధంగా ఉంటున్నాయి. వైద్య ఖర్చుల కోసం బీమాపై ఆధారపడడం కంటే పొదుపు చేసి దాంతో వైద్య ఖర్చులు భరించవచ్చనే దోరణి కొందరిలో ఉంది. అయితే, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో ప్రస్తుతం ఆరోగ్య బీమా ఉన్నా పాలసీదారులు సుమారు 60% ఆరోగ్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య 100%కు పెరుగుతుంది. ఏటా పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఆరోగ్య సమస్యలున్న చాలా కుటుంబాలు పేదరికంలోని నెట్టివేయబడుతున్నాయి. ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 7% మంది ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ఏటా పేదరికంలోకి జారుతున్నారు. అదే బీమా లేకపోతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

మోటార్‌ పరిశ్రమ

బీమా ఆధారిత ప్రమాద రక్షణ క్లెయిమ్ చెల్లింపులు సుమారు రూ.55,000 కోట్లు నిలిచిపోవడంతో మోటార్‌ బీమా విభాగం కుదేలవుతుంది. దాంతో ప్రమాదాల ఆర్థిక భారం పూర్తిగా వాహన యజమానులపై పడుతుంది. ఇది ఆర్థిక అస్థిరత పెరగడానికి, వాహన అమ్మకాలు తగ్గడానికి దారితీస్తుంది. మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌లను కవర్ చేయడంలో బీమా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోటార్‌ బీమా విభాగంగా థర్డ్‌ పార్టీ క్లెయిమ్‌ల్లో రూ.27,000 కోట్లకు పైగా సెటిల్‌ చేశారు.

సాంఘిక సంక్షేమ పథకాలు

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) కింద 2024 నవంబర్ 30 నాటికి దాదాపు 36 కోట్ల మంది లబ్ధిదారులను ధృవీకరించారు. ఈ ప్రభుత్వ పథకం సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఆసుపత్రిలో చేరడానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. బీమా పరిశ్రమ మద్దతు లేకుండా హైబ్రిడ్ నమూనా(ఇన్సూరెన్స్‌+నగదు చెల్లింపు)ను అవలంబించే రాష్ట్రాల్లో ఈ పథకం అంత ప్రభావవంతంగా ఉండదు. ఈ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

ప్రకృతి విపత్తులు

వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు విపరీతమైన మానవ, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ సమయాల్లో బీమా కీలకమైన రికవరీ మెకానిజంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్‌డీఎంఎఫ్‌)కు రూ.13,693 కోట్లు, రాష్ట్ర విపత్తు నివారణ నిధికి (ఎస్‌డీఎంఎఫ్‌) రూ.32,030.60 కోట్లు కేటాయించింది. ప్రతి ప్రకృతి విపత్తు తర్వాత ప్రభుత్వం నష్టపరిహారం కోసం భారీగా ఖర్చు చేస్తుంది. మరింత పటిష్ఠమైన బీమా కార్యక్రమాలు అమల్లోకి వస్తే ఈ నిధులను అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలకు మళ్లించవచ్చు.

వ్యవసాయం

భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) వంటి పథకాలు గత ఎనిమిదేళ్లలో రూ.1.64 లక్షల కోట్ల క్లెయిమ్‌లను అందించాయి. ఈ చెల్లింపులు రైతులకు ఆర్థిక ఉపశమనం కలిగించాయి. రైతు ఆత్మహత్యలు తగ్గడానికి దోహదం చేశాయి. దేశ ఆహార భద్రతకు రైతులు తమ వంతు సహకారాన్ని అందించేందుకు బీమా దోహదపడుతుంది.

రూ.1.73 లక్షల కోట్ల మోసపూరిత క్లెయిమ్‌లు

మోసపూరిత క్లెయిమ్‌ల వల్ల బీమా పరిశ్రమకు ఏటా కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను నిత్యం ప్రత్యేక యంత్రాగాల ద్వారా పర్యవేక్షిస్తున్నా ఫ్రాడ్‌ క్లెయిమ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లలో మొత్తం బీమా పరిశ్రమలో సుమారు 3.01 లక్షల మోసపూరిత కేసులను గుర్తించారు. వీటి విలువ రూ.1.73 లక్షల కోట్లని తేలింది. భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఈ మోసాల వల్ల ఏటా సుమారు రూ.30,000 కోట్లు నష్టపోతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

అపోహలు వీడాలి..

బీమా సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయని కొందరి అభిప్రాయం. ఇవి కేవలం లాభాల కోసమే ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అయితే బీమా కంపెనీలకు లాభాలు వచ్చినా భవిష్యత్తులో క్లెయిమ్‌లకు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ పరిశ్రమ సగటు క్లెయిమ్ నిష్పత్తి 80 శాతం కంటే ఎక్కువే. కంపెనీల రాబడితో లెక్కిస్తే క్లెయిమ్‌ నిష్పత్తి 115% వద్ద ఉంది. అంటే ప్రీమియంల ద్వారా సమ​కూరిన ప్రతి రూ.100కు పరిశ్రమ రూ.115 చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీమా సంస్థలు క్లెయిమ్ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులపై డబ్బును కోల్పోతున్నాయి.

లక్షల మందికి ఉపాధి

ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బీమా పరిశ్రమ జీవనోపాధికి తోడ్పడుతోంది. ఈ పరిశ్రమలో లాభాపేక్ష లేదని చెప్పలేం. కానీ, అదే సమయంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్రోకర్లు, టీపీఏ(థర్డ్‌పార్టీ ఏజెంట్లు)లు, ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు ఈ పరిశ్రమ విలువను పెంచుతూ ఆర్థిక, ఉపాధి వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లోకి స్టార్‌లింక్‌.. లైన్‌ క్లియర్‌..?

వ్యవస్థను దిగజార్చకూడదు..

బీమా కంపెనీలు లాభాలు సంపాదించినంత మాత్రాన అవి వినియోగదారులను మోసం చేస్తున్నాయనే అభిప్రాయాలుండడం సరైందికాదు. మోసపూరిత క్లెయిమ్‌లు చేస్తూ సంస్థలను, వ్యవస్థను దిగజార్చకూడదని నిపుణులు కోరుతున్నారు. ఈ పరిశ్రమపై అవగాహన ఉన్నవారు మరింత ఎక్కువ మందిని బీమా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)