Breaking News

సీప్లేన్‌ ఏరోడ్రోమ్‌ నిబంధనల సడలింపు

Published on Fri, 08/23/2024 - 08:39

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్‌ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్‌ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్‌లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్‌డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్‌ అవసరం లేకపోయినా టేకాఫ్‌, ల్యాండ​్‌ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్‌) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్‌లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.

ఇదీ చదవండి: ‘లెజెండ్స్‌’ సర్వీసు నిలిపేత

‘గతంలో అండమాన్ & నికోబార్‌ దీవులతో పాటు గుజరాత్‌లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్‌లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్‌, గుజరాత్‌, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్‌ ఏరోడ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)