Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న ఫ్రెంచ్ బ్రాండ్ ఇదే.. ఫోటోలు చూశారా?

Published on Thu, 07/25/2024 - 21:18

సిట్రోయెన్ కంపెనీ దేశీయ విఫణిలో ఆగష్టు 2న 'బసాల్ట్' SUVని లాంచ్ చేయనుంది. అయితే సంస్థ అంత కంటే ముందు ప్రొడక్షన్ వెర్షన్ వెల్లడించింది. ఇది చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కారు 17 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హాలోజన్ టెయిల్-ల్యాంప్‌, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ వంటివి పొందుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టోగుల్ స్విచ్‌లతో కూడిన ఆటో క్లైమేట్ కంట్రోల్, కాంటౌర్డ్ రియర్ హెడ్‌రెస్ట్‌లు మరియు స్టోరేజ్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్ వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ కారులో సన్‌రూఫ్‌ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఎక్కువమంది సన్‌రూఫ్‌ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో సిట్రోయెన్ సన్‌రూఫ్‌ లేకుండా లాంచ్ చేస్తే.. ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది తెలియాల్సిన విషయం.

బసాల్ట్ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ కలిగి.. 110 హార్స్ పవర్ మరియు 205 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని సమాచారం.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)