Breaking News

కస్టమర్‌ ఖాతాలోకి లక్షల కోట్లు!!

Published on Mon, 03/03/2025 - 07:21

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ సిస్టమ్స్‌లో లోపాల వల్ల కస్టమర్ల ఖాతాల్లోకి వేరే వాళ్ల డబ్బులొచ్చి పడుతుండటం, బ్యాంకులు నాలిక్కర్చుకుని మళ్లీ వెనక్కి తీసుకునే ఉదంతాలు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇది వేలు, లక్షల రూపాయల స్థాయిలో ఉంటుంది. అమెరికన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌లోనూ అలాంటిదే జరిగింది. కాకపోతే, ఒకటి రెండూ లక్షలు కాదు ఏకంగా లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో!  

సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. 2023 ఏప్రిల్‌లో సిటీ గ్రూప్‌ ఉద్యోగి ఓ కస్టమర్‌ ఖాతాలోకి 280 డాలర్లు క్రెడిట్‌ చేయబోయి.. అక్షరాలా 81 లక్షల కోట్ల డాలర్లను క్రెడిట్‌ చేశారు. లావాదేవీలను పర్యవేక్షించాల్సిన మరో ఉద్యోగి కూడా దాన్ని క్లియర్‌ చేశారు. ఈ దెబ్బతో సిటీగ్రూప్‌ ఖజానా ఖాళీ అయిపోయింది. దాదాపు గంటన్నర తర్వాతెప్పుడో జరిగిన పొరపాటును ఇంకో ఉద్యోగి గుర్తించడంతో, ఇది బైటపడింది. చివరికి ఆ లావాదేవీని రివర్స్‌ చేసి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని హమ్మయ్య అనుకున్నారు.

నిజానికి సిటీ గ్రూప్‌ గత ఏడాది కాలంగా సుమారు 100 కోట్ల డాలర్ల మొత్తానికి సంబంధించి ఇలాంటి పది పొరపాటు లావాదేవీలను తృటిలో తప్పించుకుంది. వాస్తవానికి ఇలాంటి పొరపాట్ల సంఖ్య పదమూడు నుంచి పదికి తగ్గిందట. ఇలాంటి పొరపాట్లను నివారించడంలో ఆశించినంత పురోగతి సాధించనందుకు గాను సిటీగ్రూప్‌కు నియంత్రణ సంస్థ 13.6 కోట్ల డాలర్ల జరిమానా విధించగా, రిస్కులు.. డేటా వైఫల్యాలకు గాను 40 కోట్ల డాలర్ల పెనాల్టీ కూడా పడింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)