Breaking News

12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి!

Published on Thu, 09/14/2023 - 12:50

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని దిగ్గజ కంపెనీలు సైతం ఆదేశించాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సిటీ బ్యాంక్ ఇండియా మాత్రం మహిళా ఉద్యోగులకు పరిమిత కాలం 'వర్క్ ఫ్రమ్ హోమ్' సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రతి స్త్రీ తల్లి అయినప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత ఉంటుందని అనాదిగా వింటున్నాం. అయితే ఆధునిక కాలంలో కొన్ని సందర్భాల్లో భార్య, భర్త తప్పకుండా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. స్త్రీ గర్భధారణ నుంచి మాతృమూర్తిగా మారి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ బ్యాంక్ ఇండియా 12 నెలలు లేదా సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది.

ఇప్పటికే 6 నెలలు మెటర్నిటీ లీవ్స్ అందిస్తోంది.. దానికి తోడు ఇప్పుడు 12 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తోంది. ఇది నిజంగా మహిళలకు గొప్ప వరం అనే చెప్పాలి. మొత్తానికి మహిళా ఉద్యోగులు 21 నెలలు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధానం తీసుకువచ్చిన మొదటి కార్పొరేట్ బ్యాంకుగా 'సిటీ బ్యాంక్' రికార్డ్ సృష్టించింది.

ప్రస్తుతం ఈ విధానాన్ని భారతదేశంలో ప్రారంభించి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరిస్తామని సిటీ బ్యాంక్ ఇండియా అండ్ సౌత్ ఆసియ హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ అన్నారు. తల్లిగా మారే మహిళ అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం అందించడం చాలా ఆనందమని వెల్లడించారు. ప్రస్తుతం సిటీ బ్యాంకులో 30వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 38 శాతం మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)