Breaking News

‘ప్రాధాన్యతా’ రుణాల విధానాల్లో సంస్కరణలు అవసరం

Published on Tue, 12/24/2024 - 11:22

ప్రాధాన్యతా రంగాల రుణాలకు (పీఎస్‌ఎల్‌) సంబంధించిన విధానాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత ప్రాజెక్టులు, ఆరోగ్య సంరక్షణ, వినూత్న ఉత్పత్తుల తయారీ వంటి వర్ధమాన రంగాలు, అత్యధికంగా ప్రభావం చూపగలిగే పరిశ్రమలను కూడా ఈ విభాగంలో చేర్చాలని ప్రతిపాదించింది.

ఇందుకోసం కొత్తగా డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్ల (డీఎఫ్‌ఐ) ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేసే అవకాశాలను పరిశీలించాలని సీఐఐ పేర్కొంది. ఇప్పటికే నిర్దిష్ట రంగాల అవసరాలను ప్రస్తుతం ఉన్న సిడ్బీ, నాబ్‌ఫిడ్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) మొదలైనవి తీరుస్తున్నాయని సీఐఐ వివరించింది. పీఎస్‌ఎల్‌ విధానం విజయవంతమైనప్పటికీ.. అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా దానికి తగు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్‌.. ఛాయ్‌..’

ఉదాహరణకు స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం పైగా ఉన్నప్పుడు పీఎస్‌ఎల్‌ కేటాయింపు 18 శాతంగా ఉండేదని.. ప్రస్తుతం సాగు రంగం వాటా 14 శాతానికి తగ్గిపోయినప్పుడు కూడా అదే తీరు కొనసాగుతోందని సీఐఐ పేర్కొంది. ఆర్థిక వృద్ధికి భారీగా తోడ్పడగలిగే సత్తా ఉన్నప్పటికీ మౌలిక రంగం, వినూత్న ఉత్పత్తుల తయారీకి పీఎస్‌ఎల్‌ పరంగా తగినంత ప్రాధాన్యం లభించడం లేదని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త పరిస్థితులు, జీడీపీలో నిర్దిష్ట రంగాల వాటా, వాటి వృద్ధి అవకాశాల ఆధారంగా పీఎస్‌ఎల్‌ విధానాన్ని ప్రతి 3–4 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని సీఐఐ తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)