Breaking News

చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్‌

Published on Tue, 04/01/2025 - 15:03

ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ ఇటీవల చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం కీలక అప్‌డేట్‌ను ప్రకటించారు. ఇటీవల చాట్‌జీపీటీలో వైరల్‌గా మారిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్‌ జీబ్లీ సర్వీసును సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోని వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్‌ చేశారు.

‘చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్‌ ఇప్పుడు ఉచిత వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది’ అని శామ్‌ ఆల్ట్‌మన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు జీపీటీ-4ఓ యూజర్లకు అందుబాటులో ఉండేది. దాన్ని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోనివారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేలా ఇటీవల విభిన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్‌ వెల్లువెత్తింది. దాంతో ఈమేరకు ఆల్ట్‌మన్‌ స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆమెకు మూడు చేతులు..!

26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ వైరల్‌ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్‌ ఇటీవల చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్‌ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్‌ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్‌, యూజర్ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు