భారతదేశంలో చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం

Published on Tue, 07/28/2026 - 13:16

చాట్‌జీపీటీ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశం, అమెరికా సహా పలు దేశాల్లో జులై 27 రాత్రి దాదాపు 8-11 గంటల ప్రాంతంలో వినియోగదారులు ఏఐ ఆధారిత చిత్రాలను రూపొందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు చాట్‌జీపీటీని పూర్తిగా యాక్సెస్ చేయలేకపోయినట్లు, మరికొందరికి ఇమేజ్‌ క్రియేట్‌ ఫీచర్ పనిచేయలేదని అవుటేజ్ ట్రాకింగ్ వేదిక డౌన్‌డిటెక్టర్‌లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఈ సమస్యపై ఓపెన్‌ఏఐ అధికారికంగా స్పందించింది. ఎక్స్ వేదికలో చేసిన పోస్టులో, ‘చాట్‌జీపీటీలో ఇమేజ్‌ క్రియేషన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని మాకు తెలుసు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ అసౌకర్యానికి క్షమించండి’ అని పేర్కొంది. అలాగే ఓపెన్‌ఏఐ అధికారిక స్టేటస్ పేజీలో కూడా సమస్యను ధ్రువీకరించింది. ప్రభావిత సేవల్లో వినియోగదారులు అధిక సంఖ్యలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని, మూల కారణాన్ని గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అనంతరం సేవలు పూర్తిగా పునరుద్ధరించినట్లు స్టేటస్ పేజీలో ప్రకటించింది.

రెండు రోజుల్లో రెండోసారి అంతరాయం

ఇది చాట్‌జీపీటీకి వరుసగా రెండు రోజుల్లో ఎదురైన రెండో అంతరాయం కావడం గమనార్హం. అంతకుముందు జులై 25న కూడా సేవల్లో అంతరాయం ఏర్పడి వెబ్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు ఇతర ఫీచర్ల వినియోగంలో సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో డౌన్‌డిటెక్టర్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)