Breaking News

అంచనాల్లో 38 శాతానికి ద్రవ్యలోటు

Published on Wed, 10/01/2025 - 09:31

కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ చివరికి రూ.5,98,153 కోట్లకు చేరింది. 2025–26 జీడీపీలో ద్రవ్యలోటు (ఆదాయం– వ్యయాల మధ్య అంతరం) 4.4 శాతం, అంటే రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. తొలి ఐదు నెలల్లో ద్రవ్యలోటు మొత్తం అంచనాల్లో 38 శాతానికి చేరింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ఈ వివరాలు విడుదల చేసింది.

ఆగస్ట్‌ చివరికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం రూ.8.1 లక్షల కోట్లు. ఇందులో రూ.4.4 లక్షల కోట్లు పన్నేతర రూపంలో, రూ.31,970 కోట్లు రుణాల రూపంలో ఉన్నాయి. పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు రూ.5.3 లక్షల కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.74,431 కోట్లు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.18.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.14.49 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయాలు కాగా, రూ.4.31 లక్షల కోట్లు మూలధన వ్యయాల కింద ఖర్చు అయింది. రెవెన్యూ వ్యయంలోనూ రూ.5,28,668 కోట్లు వడ్డీ చెల్లింపులకు పోగా, రూ.1,50,377 కోట్లు సబ్సిడీలకు వెచ్చించారు.

ఇదీ చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు.. ఎంతంటే..

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)