Breaking News

అమ్మకానికి ‘ఎనిమీ ప్రాపర్టీ’ షేర్లు

Published on Fri, 01/12/2024 - 04:55

న్యూఢిల్లీ: దేశీయంగా 84 కంపెనీల్లోని 2.91 లక్షల ’ఎనిమీ ప్రాపరీ్ట’ షేర్లను విక్రయించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి విడతలో 20 కంపెనీల్లో 1.88 లక్షల షేర్లను విక్రయించనుంది. ఇందుకోసం 10 కేటగిరీల కొనుగోలుదార్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో వ్యక్తులు, ప్రవాస భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లు, ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి.

ఫిబ్రవరి 8 కల్లా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది. 1947–1962 మధ్య కాలంలో శతృదేశాలైన పాకిస్తాన్, చైనాకు వెళ్లిపోయి, అక్కడి పౌరసత్వం తీసుకున్న వారికి భారత్‌లో ఉన్న ఆస్తులను ’ఎనిమీ ప్రాపరీ్ట’గా వ్యవహరిస్తారు.

ఇవి కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీస్‌ ఫర్‌ ఇండియా (సీఈపీఐ) అ«దీనంలో ఉన్నాయి. బిడ్డర్లు తమకు ఏ కంపెనీల్లో ఎన్ని షేర్లు, ఏ ధరకు కావాలనేది బిడ్‌లో తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒకో కంపెనీ షేర్లకు నిర్దిష్ట ధరను రిజర్వ్‌ రేటుగా నిర్ణయిస్తుంది. దీన్ని వెల్లడించదు. అంతకన్నా తక్కువ రేటు కోట్‌ చేసే బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ప్రక్రియకు మర్చంట్‌ బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)