Breaking News

సీఈఏ పదవీ కాలం పొడిగింపు

Published on Fri, 02/21/2025 - 04:39

న్యూఢిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్‌ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో నాగేశ్వరన్‌ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. కేవీ సుబ్రమణియన్‌ స్థానంలో 2022, జనవరి 28న సీఈఏగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 

వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం సీఈఏ కార్యాలయం ప్రధాన బాధ్యత. నాగేశ్వర్‌ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైం సభ్యుడిగా పనిచేశారు. భారత్, సింగ్‌పూర్‌లో అనేక బిజినెస్‌ స్కూల్స్‌లో బోధించారు. నాగేశ్వరన్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)