Breaking News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

Published on Wed, 10/16/2024 - 14:10

న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు  డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్‌ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)లో మార్పులు చేస్తుంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం పెంపు

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)