Breaking News

ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే..

Published on Fri, 01/12/2024 - 13:45

కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న తరుణంలో భారత్‌ వంటి పెద్ద దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి.  ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పన్నువసూళ్లు ఆసక్తిగా మారాయి.

పరోక్ష పన్నులతోపాటు నేరుగా ప్రజల సంపాదనపై వేసే ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23)తో పోలిస్తే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం(2023-24) ప్ర‌త్య‌క్ష ప‌న్నుల వ‌సూళ్ల‌లో 19.41 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటీ) వెల్ల‌డించింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.14.70 ల‌క్ష‌ల కోట్ల ప‌న్ను వ‌సూళ్లు జ‌రిగాయ‌ని తెలిపింది. జ‌న‌వ‌రి 10 నాటికి ప్ర‌త్యక్ష ప‌న్ను వ‌సూళ్లు స్థిర‌మైన వృద్ధిరేటు కొన‌సాగిస్తున్నాయ‌ని సీబీడీటీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్లు 2023-24 బ‌డ్జెట్ అంచ‌నాల్లో 80.61 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం పేర్కొంది.

ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్లు (వ్య‌క్తిగ‌త ఆదాయం ప‌న్ను, కార్పొరేట్ టాక్స్‌) రూపేణా రూ.18.23 ల‌క్ష‌లు వ‌సూలు చేయాల‌ని బ‌డ్జెట్ అంచ‌నాల్లో గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఇది 2022-23 సంవ‌త్స‌రం రూ.16.61 ల‌క్ష‌ల కోట్ల‌తో పోలిస్తే 9.75 శాతం ఎక్కువ‌. ఇక గ‌తేడాది ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2024 జనవరి 10 వ‌ర‌కు ఐటీ రీఫండ్స్ రూ.2.48 ల‌క్ష‌ల కోట్లుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన!

స్థూల ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్లు రూ.17.18 ల‌క్ష‌ల‌కోట్లు కాగా, గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే 16.77 శాతం ఎక్కువ‌. స్థూల కార్పొరేట్ టాక్స్ (సీఐటీ) వ‌సూళ్లు 8.32 శాతం, వ్య‌క్తిగ‌త ప‌న్ను ఆదాయం (పీఐటీ) వ‌సూళ్లు 26.11 శాతం పెరిగాయి. రీఫండ్స్ స‌ర్దుబాటు త‌ర్వాత సీఐటీ వ‌సూళ్ల‌లో నిక‌ర వృద్ధిరేటు 12.37 శాతం, పీఐటీ వ‌సూళ్ల‌లో 27.26 శాతంగా న‌మోదైనట్లు తెలిసింది.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)