Breaking News

ఈ బ్యాంకుకు 115 ఏళ్లు..

Published on Thu, 12/25/2025 - 17:24

ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ 115 వ్యవస్థాపక దినోత్సవాన్ని ముంబైలో జరుపుకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు పాల్గొన్నారు.

తొలి స్వదేశీ బ్యాంక్‌ అయిన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం చేయడంలో, సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. బ్యాంకు రుణాల్లో ఆర్‌ఏఎం (గ్రామీణ, వ్యవసాయ, చిన్నమధ్య తరహా సంస్థలకు లోన్స్‌) వాటా 72 శాతంగా ఉండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా 4,556 శాఖలు, 21,492 టచ్‌ పాయింట్లతో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు ఎండీ కల్యాణ్‌ కుమార్‌ తెలిపారు. వ్యాపార పరిమాణం రూ. 7,37,938 కోట్లకు చేరినట్లు వివరించారు.

భారతదేశంలో తొలి స్వదేశీ బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) పేరుగాంచింది. 1911లో పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో, నిర్వహణలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది. సోరాబ్జీ పోచ్‌ఖానావాలా దీనిని స్థాపించారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు