ఆర్‌బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల నుంచి కేంద్రానికి రూ.70,000 కోట్లు!

Published on Wed, 01/31/2024 - 11:06

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల (ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌) ద్వారా ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.70,000 కోట్ల డివిడెండ్‌ను పొందవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ మేరకు అంచనాలు ఉండవచ్చన్నది సమాచారం. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషనల్స్‌ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్లను కేంద్ర బడ్జెట్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని మించి వనగూడాయి. ఒక్క ఆర్‌బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను అందించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇదే సానుకూల అంకెలు వచ్చాయి. దీనితో 2023–24 కన్నా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ డివిడెండ్లు వెలువడుతాయన్న అంచనాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: బడ్జెట్‌ 2024-25 కథనాల కోసం క్లిక్‌ చేయండి

2023–24లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా బడ్జెట్‌ అంచనా. 2025–26లో దీనిని 4.5 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 5.4 శాతంగా ద్రవ్యలోటు ఉండాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్స్‌లో భాగంగా ఉంది.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)