Breaking News

సిమెంట్‌ కంపెనీలకు సీసీఐ ఆదేశాలు

Published on Sun, 07/06/2025 - 04:36

న్యూఢిల్లీ: పోటీ నిబంధనల ఉల్లంఘన దర్యాప్తులో భాగంగా ఆర్థిక ఫలితాల వివరాలను దాఖలు చేయమంటూ సిమెంట్‌ రంగ దిగ్గజాలు అ్రల్టాటెక్,  దాల్మియా భారత్, శ్రీ దిగి్వజయ్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) ఆదేశించింది. ఆడిటెడ్‌ ఆర్థిక ఫలితాలతోపాటు.. బ్యాలన్స్‌ షీట్, లాభనష్టాల ఖాతా వివరాలను 8 వారాలలోగా అందించాలని పేర్కొంది. 

పోటీ నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టర్‌ జనరల్‌ గుర్తించిన నేపథ్యంలో మూడు సెమెంట్‌ రంగ కంపెనీలను సీసీఐ తాజాగా ఆదేశించింది. అయితే అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న ఇండియా సిమెంట్స్‌కు చెందిన ఐదేళ్ల వివరాల కోసం అల్ట్రాటెక్‌కు సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. 2015–19 ఆర్థిక సంవత్సరాల ఖాతాల వివరాలను వెల్లడించవలసి ఉంటుందని పేర్కొంది. 

ఈ బాటలో  దాల్మియా భారత్‌ సిమెంట్స్, శ్రీ దిగ్విజయ్‌ సిమెంట్స్‌ను 2011 నుంచి 2019వరకూ తొమ్మిదేళ్ల కాలానికి ఆర్థిక వివరాలను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా ఐదేళ్ల కాలానికి ఆదాయపన్ను రికార్డులు, ఆర్థిక వివరాలను సమూలంగా తెలియజేయవలసిందిగా ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను సైతం ఆదేశించింది. దర్యాప్తు నివేదికపై లాంచనప్రాయ సమాధానాలను సైతం సమరి్పంచమంటూ ఆదేశించింది. 

కాగా.. ఈ అంశాలపై అ్రల్టాటెక్, దాల్మియా భారత్‌ స్పందించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమ టెండర్లలో జట్టుకడుతున్నట్లు సిమెంట్‌ రంగ కంపెనీలపై ఇంధన రంగ పీఎస్‌యూ ఓఎన్‌జీసీ ఫిర్యాదు చేయడంతో సీసీఐ తాజా ఆదేశాలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో 2020 నవంబర్‌ 18న సీసీఐ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టవలసిందిగా డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)ను ఆదేశించింది. 2025 ఫిబ్రవరి 18న డీజీ దర్యాప్తు నివేదికను సీసీఐకు అందించింది. 

తదుపరి 2025 మే 26న ఓఎన్‌జీసీకి సిమెంట్‌ అమ్మకాల ద్వారా అందుకున్న ఆదాయ వివరాలను దాఖలు చేయవలసిందిగా ఈ మూడు సిమెంట్‌ తయారీ కంపెనీలకు సూచించింది. 2024 డిసెంబర్‌లో ఇండియా సిమెంట్స్‌ ప్రమోటర్ల నుంచి 32.72 శాతం వాటాను అ్రల్టాటెక్‌ సిమెంట్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. మార్కెట్‌ నుంచి మరో 22.77 శాతం వాటా సైతం సొంతం చేసుకుంది. వెరసి ఇండియా సిమెంట్స్‌కు ప్రమోటర్‌గా అ్రల్టాటెక్‌ అవతరించింది. 
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు