Breaking News

ఎస్‌ఎంఈ రుణాలపై మరింత ఫోకస్‌

Published on Sat, 01/25/2025 - 00:56

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రైవేట్‌ రంగ క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌ (సీఎస్‌బీ) తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) రుణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగం కోసం రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆరు శాఖలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎంఈ, ట్రాన్సాక్షన్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ హెడ్‌ శ్యామ్‌ మణి తెలి పారు. 

ఎస్‌ఎంఈలకు రుణాల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు శుక్రవారమిక్కడ  నిర్వహించిన కార్యక్రమంలో పా ల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. టర్బో, శుభమంగళ్‌ వంటి ఉత్పత్తులతో చిన్న సంస్థలకు సత్వరం రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. 
 
సెప్టెంబర్‌ ఆఖరు నాటికి బ్యాంకు మొత్తం రుణాల్లో ఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియో సుమారు 13%గా, దాదాపు రూ. 3,400 కోట్ల స్థాయిలో ఉందని శ్యామ్‌ తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 12 శాతమని, ఇది సుమారు 28% వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఎస్‌ఎంఈ రుణాల విషయంలో హైదరాబాద్‌లో ఫార్మా బల్క్‌ డ్రగ్స్‌ విభాగంపై,  ఆంధ్రప్రదేశ్‌లో తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాలపైనా ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్నట్లు శ్యామ్‌ చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్‌ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లు కాగా.. హైదరాబాద్‌ వాటా సుమారు రూ. 44,000 కోట్లుగా ఉందని చెప్పారు. ఇందులో ఎస్‌ఎంఈల వాటా దాదాపు రూ.15,000 కోట్లుగా అంచనా వేశారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)