Breaking News

దశాబ్దం తర్వాత భారత్‌లోకి కారెఫోర్‌.. భారీ విస్తరణకు ప్లాన్!

Published on Sat, 09/05/2026 - 19:15

రిటైల్‌ రంగ ఫ్రెంచ్‌ దిగ్గజం కారెఫోర్‌ దశాబ్దం తదుపరి భారత్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. దుబాయ్‌కు చెందిన అపారెల్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం ద్వారా స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక్కడ 50,000 చదరపు అడుగులలో కారెఫోర్‌ స్టోర్‌ను అపారెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. రానున్న నాలుగు వారాల్లోగా మరో స్టార్‌ను జత చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ బాటలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మరిన్ని స్టోర్లకు తెరతీయనున్నట్లు తెలిపింది. వచ్చే వేసవికల్లా దేశ పశ్చిమ ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు పేర్కొంది. వృద్ధికి దన్నుగా ఇతర సంస్థల కొనుగోళ్లను చేపట్టనున్నట్లు అపారెల్‌ గ్రూప్‌ తెలియజేసింది. తొలి దశ విస్తరణలో భాగంగా రానున్న ఐదేళ్లలో 50 ఫుడ్‌ అండ్‌ గ్రోసరీ స్టోర్లను తెరవనున్నట్లు తెలియజేసింది.

2010లో తొలుత.. 
కారెఫోర్‌ ఇంతక్రితం 2010లో క్యాష్‌ అండ్‌ క్యారీ(హోల్‌సేల్‌) బిజినెస్‌ ద్వారా దేశీయంగా కార్యకలాపాలకు తెరతీసింది. ఆపై ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడానికితోడు విస్తరణకు వీలైన స్థానిక భాగస్వామి లభించకపోవడంతో 2014లో ఐదు స్టోర్లను మూసివేసింది. కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది.

కాగా.. ప్రస్తుతం అప్రమత్తతతో బిజినెస్‌ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు అపారెల్‌ గ్రూప్‌ యజమాని, చైర్మన్‌ నీలేష్‌ వేద్‌ పేర్కొన్నారు.   సొంత స్టోర్లను విస్తరిస్తూనే వృద్ధిని పెంచుకునేందుకు ఇతర సంస్థలను సొంతం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించారు. తొలి దశలో హైపర్‌మార్కెట్‌ విధానంపై దృష్టిపెట్టి ముందుకుసాగనున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా 50,000 ఎస్‌కేయూలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

#

Tags : 1

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)