Breaking News

సీజన్‌ ముగిసినా.. సందడే సందడి

Published on Sat, 11/23/2024 - 05:30

పండుగ సీజన్‌ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఆటో డీలర్ల అసోసియేషన్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. 

వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్‌ పోర్టల్‌ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్‌ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి.

 ‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్‌ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.

30% వరకు..
కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్‌ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్‌ ధరలపై (ఎక్స్‌షోరూమ్‌) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్‌ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. 

అంతగా అమ్ముడు కాని మోడల్స్‌ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్‌ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ సీఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు.  

ఆఫర్ల వెల్లువ.. 
→ ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్‌ఆర్, సెలీరియో, ఎస్‌ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్‌ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్‌ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్‌ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి.  

→ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తమ గ్రాండ్‌ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్‌టర్‌పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇక టక్సన్‌పై రూ. 50,000, అయానిక్‌ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది.  

→ టాటా మోటార్స్‌ కూడా అ్రల్టోజ్‌పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్‌) రూ. 20,000 నగదు డిస్కౌంట్‌ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్‌ సెడాన్, నెక్సాన్‌ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్‌) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. 

→ మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్‌ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్‌ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్‌ ఉంటోంది. 

→ హోండా కార్స్‌ ఇండియా, జీప్‌ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు అందిస్తున్నాయి.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)