Breaking News

అమ్మకాల్లో దేశీయ దిగ్గజాల హవా!.. ఏప్రిల్‌లో కార్ సేల్స్ ఇలా..

Published on Tue, 05/06/2025 - 15:35

న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి ఇండియా వాటా ఏప్రిల్‌లో 40 శాతం లోపునకు పడిపోయింది. 1,38,021 వాహన విక్రయాలతో 39.44 శాతానికి పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో 1,39,173 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 40.39 శాతం మార్కెట్‌ వాటా నమోదు చేసింది.

ఆటోమోటివ్‌ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం భారీ స్థాయిలో ఎస్‌యూవీ విక్రయాలతో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఏప్రిల్‌లో అత్యధికంగా లబ్ధి పొందింది. నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.

కంపెనీ అమ్మకాలు 38,696 యూనిట్ల నుంచి 48,405 యూనిట్లకు పెరగడంతో.. మార్కెట్‌ వాటా 11.23 శాతం నుంచి 13.83 శాతానికి పెరిగింది. ఇక సుదీర్ఘకాలంగా రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్‌ మోటార్స్‌ (హెచ్‌ఎంఐఎల్‌) 43,642 యూనిట్ల అమ్మకాలు, 12.47 శాతం మార్కెట్‌ వాటాతో నాలుగో స్థానానికి పడిపోయింది. టాటా మోటార్స్‌ 44,065 వాహన విక్రయాలతో మూడో స్థానంలో కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 3,44,594 యూనిట్ల నుంచి 1.55 శాతం వృద్ధితో 3,49,939 యూనిట్లకు చేరాయి.

2024–25 పూర్తి సంవత్సర వివరాలు..
➤గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 16,71,559 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ 40.25 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది. 2023–24లో 16,08,041 వాహనాలు విక్రయించగా, మార్కెట్‌ షేర్‌ 40.6 శాతంగా నమోదైంది.

➤హెచ్‌ఎంఐఎల్‌ 5,59,149 యూనిట్లు, 13.46 శాతం మార్కెట్‌ వాటాతో 2024–25లో మారుతీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2023–24లో 5,62,865 వాహన విక్రయాలు, 14.21 శాతం వాటాను సాధించింది.

ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!

➤టాటా మోటార్స్‌ 5,35,960 యూనిట్లు విక్రయాలు, 12.9 శాతం వాటాతో మూడో స్థానంలో కొనసాగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 5,39,567 యూనిట్లు కాగా, మార్కెట్‌ వాటా 13.62 శాతం.         

➤5,12,626 యూనిట్ల అమ్మకాలు, 12.34 శాతం మార్కెట్‌ వాటాతో ఎంఅండ్‌ఎం నాలుగో స్థానంలో నిలి్చంది. 2023–24లో కంపెనీ రిటైల్‌ అమ్మకాలు 4,27,390 యూనిట్లు కాగా, మార్కెట్‌ వాటా 10.79 శాతంగా ఉంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)