Breaking News

నేటి నుంచి పెరిగిన కార్ల ధరలు.. ఎంతంటే..?

Published on Tue, 01/16/2024 - 16:46

దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ.. త‌మ సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న కార్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు మంగళవారం ప్రకటించింది. పెంచిన ధ‌ర‌లను నేటి నుంచి అమ‌ల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్ల‌డించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కార‌ణంగానే ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు వివ‌రించింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 0.45 శాతం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల ఉటుంద‌ని సంస్థ పేర్కొంది. వాహ‌నాల పెంపు త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల‌కు స‌మాచారం అందించింది. వాహ‌నాల ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యంతో స్టాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి షేర్లు మంగ‌ళ‌వారం ప్రారంభ సెష‌న్‌లో దాదాపు 1.5 శాతం లాభ‌ప‌డ్డాయి. కంపెనీ గత ఏడాది ఏప్రిల్ 1న తన అన్ని వాహనాల మోడళ్ల ధరలను పెంచింది. డిసెంబర్ 2023లో కంపెనీ మొత్తం 1,37,551 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. డిసెంబర్ 2022లో విక్రయించిన 1,39,347 యూనిట్లతో పోలిస్తే 1.28 శాతం క్షీణించింది. కానీ 2023 క్యాలెండర్ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2 కోట్ల వాహనాలను విక్రయించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..?

ఇక మ‌రో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిప‌దార్ధాల ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో త‌మ వాహ‌నాల ధ‌ర‌ల‌ను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హోండా కార్స్ ఇండియా, ల‌గ్జీరీ కార్ల త‌యారీ కంపెనీ(ఆడి) సైతం ఈ నెల‌లో త‌మ కార్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)