Breaking News

కెనరా హెచ్‌ఎస్‌బీసీ @ రూ. 100–106

Published on Wed, 10/08/2025 - 04:54

న్యూఢిల్లీ: బీమా రంగ కంపెనీ కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 100–106 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 2,516 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు 9న షేర్లను ఆఫర్‌ చేయనుంది. లిస్టింగ్‌లో కంపెనీ విలువ రూ. 10,000 కోట్లుగా నమోదయ్యే వీలుంది.

ఈ భాగస్వామ్య సంస్థలో పీఎస్‌యూ కెనరా బ్యాంక్‌కు 51%, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్‌ కంపెనీ హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్‌ (ఏషియా పసిఫిక్‌) హోల్డింగ్స్‌కు 26% చొప్పున వాటా ఉంది. ఐపీవోలో కెనరా బ్యాంక్‌ 13.77 కోట్ల షేర్లు(14.5 శాతం వాటా), హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్‌ 47.5 లక్షల షేర్లు(0.5 శాతం వాటా)తోపాటు.. ఇన్వెస్టర్‌ సంస్థ పంజాబ్‌ నేషనల్‌బ్యాంక్‌ (పీఎన్‌బీ) 9.5 కోట్ల షేర్లు(10 శాతం వాటా) విక్రయించనున్నాయి.  రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 140 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  ఈ బాటలో ఈ నెల 9న కెనరా రొబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఐపీవో సైతం ప్రారంభం కానుంది. ఇది 13న ముగియనుంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)