Breaking News

బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్‌ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?

Published on Thu, 09/21/2023 - 08:15

ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్‌కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్‌' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్‌' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు.

గతంలో అర్జున బైజూస్‌లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తరువాత  రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్‌టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు.

మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు.

బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)