Breaking News

వ్యాపార అవకాశాలపై కంపెనీల ధీమా 

Published on Thu, 08/07/2025 - 06:38

న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఏప్రిల్‌–జూన్‌ వ్యవధిలో వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) 149.4కి పెరగడం ఇందుకు నిదర్శనం. జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 139.3గా నమోదైనట్లు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) వెల్లడించింది. 

ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నవారిలో వచ్చే ఆరు నెలల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని 78.7 శాతం, దేశీయంగా అమ్మకాలు పెరుగుతాయని 79.1 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే ముడి వస్తువుల దిగుమతులు పెరుగుతాయని 54.3 శాతం, పన్నుల ముందు లాభాలు మెరుగుపడతాయని 61 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆరు నగరాలవ్యాప్తంగా జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 479 కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడుల వాతావరణం తదితర నాలుగు అంశాలు బీసీఐకి ప్రాతిపదికగా ఉంటాయని ఎన్‌సీఏఈఆర్‌ తెలిపింది.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)