Breaking News

ఎన్‌పీఎస్‌ వాత్సల్యకూ పన్ను ఊరట 

Published on Sun, 02/02/2025 - 05:01

న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్‌కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్‌పీఎస్‌ పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్‌ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్‌ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి  వెసులుబాటు ఉంది.

 దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి  కల్పించారు. సాధారణ ఎన్‌పీఎస్‌ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్‌పీఎస్‌ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్‌ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్‌పీఎస్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు