Breaking News

బడ్జెట్‌లో మహిళలు ఏం కోరుతున్నారంటే..

Published on Sat, 07/20/2024 - 12:02

కేంద్ర బడ్జెట్ 2024ను జులై 23న ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్‌లు పెరుగుతున్నాయి. కొత్తగా కంపెనీలు స్థాపించిన మహిళలు వారికి సరైన ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం బడ్జెట్‌లో చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.

పబ్లిక్ పాలసీ కన్సల్టింగ్ సంస్థ టీక్యూహెచ్‌ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకురాలు అపరాజిత భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలి. స్టార్టప్‌ కంపెనీలు కలిగి ఉండడంలో భారతదేశం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. అయినప్పటికీ 2020 నుంచి 2022 వరకు మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు సేకరించిన నిధుల వాటా మొత్తం స్టార్టప్ ఫండింగ్‌లో కేవలం 15 శాతం మాత్రమే. మహిళలకు సరైన నైపుణ్యాలు అందించి కొత్త కంపెనీలు స్థాపించే దిశగా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు సారథ్యం వహిస్తున్న స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేలా క్యాపిటల్‌ వెంచర్‌లను ప్రోత్సహించేలా బడ్జెట్‌ను రూపొందించాలి’ అని తెలిపారు.

ఇదీ చదవండి: తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?

ఈ సందర్భంగా కినారా క్యాపిటల్ సీఈఓ హార్దికా షా మాట్లాడుతూ..‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలోని శ్రామికశక్తిలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు, ప్రోత్సాహకాలు అందించి ఎంఎస్‌ఎంఈలో పనిచేసేలా నిర్ణయం తీసుకోవాలి. మహిళా శ్రామిక శక్తి 2021-22లో 32.8 శాతం నుంచి 2022-23లో 37 శాతానికి పెరిగినప్పటికీ దీన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి. సమీప భవిష్యత్తులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు లక్ష్యం 8 శాతంగా నిర్ణయించారు. దాన్ని సాధించడానికి మహిళల శ్రామిక భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)