Breaking News

ద్రవ్యలోటు కట్టడిలో తగ్గేదేలే..!

Published on Fri, 02/02/2024 - 06:26

ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు కట్టడిలో తన చిత్తశుద్దిని కేంద్రం తాజా బడ్జెట్‌ ద్వారా ఉద్ఘాటించింది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్‌ అంచనావేసింది. 2025–26 నాటికి ఈ లోటును 4.5 శాతానికి తగ్గాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ అన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరం (2022–23) ద్రవ్యలోటు 6.4 శాతం.

మార్చితో ముగిసే ప్రస్తుత (2023–24) ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని 5.9 శాతంగా గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన సమరి్పంచిన బడ్జెట్‌ నిర్దేశించుకుంది. అయితే ఇది 5.8 శాతానికే పరిమితమవుతుందని 2024–25 మధ్యంతర బడ్జెట్‌ పేర్కొంది. భారీ పన్ను ఆదాయాలు ద్రవ్యలోటు  అంచనా సానుకూలంగా 5.9 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గడానికి కారణంగా వివరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు విలువలో రూ.17,34,773 కోట్లు ఉంటే,  2024–25 రూ.16,85,494 కోట్లకు తగ్గుతుందని మధ్యంతర బడ్జెట్‌ పేర్కొంది. ఇక స్థూల, నికర మార్కెట్‌ రుణాలు 2024–25లో వరుసగా రూ.14.13 లక్షల కోట్లు, రూ.11.75 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్‌ తెలిపింది. ఈ రెండు సంఖ్యలూ 2023–24తో పోల్చితే తక్కువే కావడం గమనార్హం. ప్రభుత్వం తక్కువ రుణాలను తీసుకోవడం వల్ల ప్రైవేట్‌ రంగానికి పెద్ద ఎత్తున రుణాల లభ్యత సులభతరం అవుతుందని ఆర్థికమంత్రి వ్యాఖ్యానించారు.   

ద్రవ్యలోటును తగ్గించడానికి భారతదేశం నిర్దేశించిన లక్ష్యాలను మెరుగుపరిచిందనే సందేశాన్ని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు విస్తృత స్థాయిలో పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. బడ్జెట్‌ అనంతర సమావేశంలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, 

‘‘మేము ఇంతకుముందు ఇచి్చన ద్రవ్యలోటు రోడ్‌మ్యాప్‌ను అనుసరించడంలో, మెరుగుపరచడంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఇది ప్రతి రేటింగ్‌ సంస్థకు సూటిగా పంపుతున్న ఒక  స్పష్టమైన సందేశం. ఏజెన్సీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని అన్నారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీ డివిడెండ్లు, పన్ను సమీకరణలో మెరుగుదల ద్రవ్యలోటు కట్టడిలో లక్ష్య సాధనకు దోహదపడుతున్న అంశాలు. గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజ సంస్థలు– ఫిచ్, ఎస్‌అండ్‌పీ, మూడీస్‌లు దేశానికి అతి దిగువస్థాయి ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ రేటింగ్‌ను ఇస్తున్నాయి. చెత్త స్థాయికి ఈ రేటింగ్‌ కేవలం ఒకమెట్టు ఎక్కువ. అధిక రేటింగ్‌ కోసం కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అంతగా ఫలితం ఇవ్వడంలేదు. ఒకదేశంలో పెట్టుబడులను పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, ఆయా సంస్థలు ఈ రేటింగ్‌లనే ప్రాతిపదికగా తీసుకుంటాయి.    
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)