Breaking News

చిన్న సంస్థలకు ఊతం.. రుణ హామీ పథకం

Published on Wed, 07/24/2024 - 07:55

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చర్యలు ప్రతిపాదించారు. యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్‌ లేదా థర్డ్‌ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్‌ లోన్స్‌ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు.

దీనికోసం విడిగా సెల్ఫ్‌–ఫైనాన్సింగ్‌ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుందని పేర్కొన్నారు. దీన్ని పొందేందుకు రుణగ్రహీత ముందస్తుగా నిర్దిష్ట గ్యారంటీ ఫీజును, రుణ బ్యాలెన్స్‌ తగ్గే కొద్దీ వార్షిక ఫీజును కట్టాల్సి ఉంటుంది.

ఎస్‌ఎంఈలకు గడ్డు కాలంలో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. తమ పరిధిలో లేని కారణాల వల్ల స్పెషల్‌ మెన్షన్‌ అకౌంటు (ఎస్‌ఎంఏ) దశలోకి చేరిన ఎంఎస్‌ఎంఈలు ఆ తదుపరి మొండి బాకీల్లోకి జారిపోకుండా సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది.  

కొత్త అసెస్‌మెంట్‌ విధానం..: 
ఎంఎస్‌ఎంఈలకు రుణాల విషయంలో కొత్త మదింపు విధానాన్ని మంత్రి ప్రతిపాదించారు. అసెస్‌మెంట్‌ కోసం బైటి సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు దానికి సంబంధించి అంతర్గతంగా సొంత విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ అసెస్‌మెంట్‌ విధానంతో పోలిస్తే ఈ మోడల్‌ మెరుగ్గా ఉండగలదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇక ఎంఎస్‌ఎంఈలు, సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకునేందుకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ–కామర్స్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)