Breaking News

మారిన బీఎస్ఎన్ఎల్ లోగో: కొత్తగా ఏడు సర్వీసులు

Published on Tue, 10/22/2024 - 18:53

ప్రభుత్వ రంగ నెట్‌వర్క్ 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) కొత్త లోగోను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ఆవిష్కరించారు. కొత్త లోగో విశ్వాసం, బలం, దేశవ్యాప్తంగా చేరువ కావడానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

కొత్త లోగో
మారిన కొత్త బీఎస్ఎన్ఎల్ లోగో గమనించినట్లయితే.. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారతదేశ చిత్రపటం ఉండటం గమనించవచ్చు. దానిపైన తెలుగు, ఆకుపచ్చ రంగులో కనెక్టివిటీ సింబల్స్ ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అనేది నీలి రంగులో ఉంది. దానికి కింద కెనెక్టింగ్ భారత్ అనేది కూడా కాషాయ రంగులోనే ఉంది.

ఏడు కొత్త సర్వీసులు
స్పామ్-రహిత నెట్‌వర్క్: ఈ కొత్త సర్వీస్ వినియోగదారులను అవాంఛిత కాల్‌లు, మెసేజ్‌ల నుంచి బయటపడేస్తుంది. క్లీన  కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి దీనిని పరిచయం చేయడం జరిగింది.

బీఎస్ఎన్ఎల్ వైఫై నేషనల్ రోమింగ్: వినియోగదారులు అదనపు ఛార్జీల గురించి చింతించకుండా దేశవ్యాప్తంగా వైఫై యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయంలో కనెక్ట్ అయి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.

బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్టీవీ: ఈ సర్వీస్ ఫైబర్ టు ది హోమ్ (FTTH) కనెక్షన్‌లతో వినియోగదారుల కోసం 500 ప్రీమియం ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. తద్వారా యూజర్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పొందవచ్చు.

ఎనీ టైమ్ సిమ్ కియోస్క్‌: ఎప్పుడైనా, ఎక్కడైనా సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం ప్రత్యేక కేంద్రాలను యెఫ్తాను చేయనున్నారు.

డైరెక్ట్-టు-డివైస్ సర్వీస్ (D2D): ఈ సర్వీస్ ద్వారా శాటిలైట్‌ టు డివైజ్‌ కనెక్టివిటీ పొందవచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఎస్‌ఎంఎస్‌ సేవలను ఆస్వాదించవచ్చు.

పబ్లిక్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌: బిఎస్ఎన్ఎల్ అత్యవసర సమయంలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ సేఫ్టీ ఫీచర్లతో భద్రతమైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది.

గనులలో ప్రైవేట్ 5జీ: ఈ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ మైనింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన 5జీ కనెక్టివిటీను అందిస్తుంది. రిమోట్ లొకేషన్లలోని కార్మికులకు కమ్యూనికేషన్ మరియు భద్రతను మెరుగుపరుస్తుంది.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)