Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్తగా 8.5 లక్షల మంది..

Published on Fri, 11/22/2024 - 02:59

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ టెలికం సంస్థలు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా 2024 సెప్టెంబర్‌లో కోటి మందికిపైగా వైర్‌లెస్‌ చందాదారులను కోల్పోయాయి. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ సుమారు 8.5 లక్షల మంది కొత్త కస్టమర్లను దక్కించుకుంది. ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌ మాసంలో రిలయన్స్‌ జియోకు 79.69 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌ 14.34 లక్షలు, వొడాఫోన్‌ ఐడియాకు 15.53 లక్షల మంది దూరమయ్యారు.

 సెప్టెంబర్‌ చివరినాటికి మొత్తం వైర్‌లెస్‌ చందాదార్ల సంఖ్య 0.87 శాతం పడిపోయి 115.37 కోట్లకు వచ్చి చేరింది. ఇందులో రిలయన్స్‌ జియోకు 46.37 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ 38.34 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 21.24 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 9.18 కోట్ల మంది ఉన్నారు. వైర్‌లెస్‌ వినియోగదార్లు నగరాల్లో 0.80 శాతం, గ్రామాల్లో 0.95 శాతం తగ్గారు. వైర్డ్, వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ చందాదార్ల సంఖ్య 0.51% క్షీణించి 94.44 కోట్లు నమోదైంది. ఇందులో రిలయన్స్‌ జియోకు 47.7 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ 28.5 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 12.6 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 3.7 కోట్ల మంది ఉన్నారు. 

మార్కెట్‌ వాటా పొందేందుకు.. 
జూలైలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా మొబైల్‌ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదలని ఉండబోదని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ రాబర్ట్‌ రవి గత నెలలో స్పష్టం చేయడం గమనార్హం. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్‌ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల స్పామ్‌ బ్లాకర్స్, ఆటోమేటెడ్‌ సిమ్‌ కియోస్‌్క, డైరెక్ట్‌–టు–డివైస్‌ తదితర సేవలను ప్రారంభించింది.   
 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)