Breaking News

రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్

Published on Thu, 02/13/2025 - 11:51

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. సంస్థ యూజర్లకు దీర్ఘకాలిక సర్వీసు అందించే లక్ష్యంతో 365 రోజుల వ్యాలిడిటీతో ఆకర్షణీయమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రోజూ 2 జీబీ డేటాను అందించే ఈ ప్యాక్‌ సంవత్సరం పొడవునా ఇంటర్‌నెట్‌ అవసరమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

కొత్త ప్లాన్‌ వివరాలు..

వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే వినియోగదారులు ఒకసారి రీఛార్జ్‌తో ఏడాది పొడవునా నిరంతరాయ సేవలను పొందవచ్చు.

రోజువారీ డేటా: వినియోగదారులకు రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.

ధర: ఈ ప్లాన్ ధర రూ.1515.

వాయిస్‌ కాల్స్‌ ఉండవు..

ఈ ప్లాన్‌లో ప్రధానంగా డేటాపై దృష్టి సారించారు. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు ఉండవు. అయితే బీఎస్ఎన్ఎల్ అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను అందిస్తోంది. ఏడాది పొడవునా స్థిరమైన ఇంటర్నెట్ అవసరమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

ఇదీ చదవండి: ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ డీల్ దక్కించుకున్న రిలయన్స్‌

బీఎస్ఎన్ఎల్ విభిన్న ప్రయోజనాలతో ఇతర ప్లాన్లను కూడా అందిస్తుంది. రూ.1198 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. నెలకు 300 నిమిషాల ఉచిత కాల్స్, 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్‌లు, ఉచిత రోమింగ్ అందిస్తుంది. వినియోగదారులకు ఈ ప్లాన్ కోసం నెలకు రూ.100 వరకు ఖర్చు అవుతుంది. డేటా, వాయిస్ సర్వీసులు కావాలనుకునే వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)