Breaking News

తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?

Published on Thu, 07/18/2024 - 14:52

బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆగస్టు 1న బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 2 శాతం దరిదాపుల్లో స్థిరంగా ఉంటున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

2021 జులైలో బ్రిటన్‌లో చివరి సారిగా ద్రవ్యోల్బణం 2 శాతంగా నమోదైంది. కానీ ‍క్రమంగా అది పెరుగుతూ 2022 నాటికి 11 శాతానికి చేరింది. దాంతో కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చారు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో క్రూడాయిల్‌ ధర పెరుగడంతో వడ్డీరేట్లలో మార్పులు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇంధన ఖర్చులూ అధికమయ్యాయి. అయితే కొంతకాలం నుంచి క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం బ్రిటన్‌ ద్రవ్యోల్బణం 2 శాతానికి దరిదాపుల్లోకి రావడంతో ఆగస్టు 1న వడ్డీరేట్లను తగ్గిస్తారని నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో 5.25 శాతం వడ్డీరేటు ఉంది.

ఇదీ చదవండి: రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదం

ఇదిలాఉండగా, ఇటీవల అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ ఫావెల్‌ మీడియాతో మాట్లాడుతూ యూఎస్‌లో కీలకవడ్డీ రేట్లను పెంచే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అయితే తగ్గిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వడ్డీ రేట్లను తగ్గించాలంటే మరికొన్ని నివేదికలు అవసరమన్నారు. జులైలో 30-31న జరిగే ఫెడ్‌ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ భావిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)