Breaking News

త్వరలో 7,000 మందికి జాబ్‌ కట్‌! ఎక్కడంటే..

Published on Mon, 11/04/2024 - 14:18

ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్‌ రంగంలో సేవలందిస్తున్న బాష్‌ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్‌లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్‌పోస్పోలిటా నివేదించింది.

జెక్‌పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్‌ సీఈఓ స్టీఫెన్‌ హర్తంగ్‌ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్‌ సేవలందిస్తున్న బాష్‌ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్‌లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్‌లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు.

విభిన్న రంగాల్లో సిబ్బంది సర్దుబాటు

‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం అమ్మకాలపై రాబడి అధికంగా 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. 2026 నాటికి ఇది ఏడు శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 2024లో కంపెనీ అంచనాలను చేరుకోకపోవచ్చు. ప్రస్తుతానికి మా సిబ్బందిని విభిన్న విభాగాల్లో మరింత సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.

ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!

రూ.66 వేలకోట్లతో కొనుగోలు

బాష్‌ కంపెనీ ఉద్యోగులను తగ్గించాలని భావిస్తున్నప్పటికీ ఇతర కంపెనీల కొనుగోలుకు ఆసక్తిగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. బాష్‌ సంస్థ ఐరిష్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా ఉండబోతున్న ఈ డీల్‌ విలువ ఏకంగా ఎనిమిది బిలియన్‌ డాలర్లు(రూ.66 వేలకోట్లు)గా ఉంది. హీట్ పంప్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి