ఆర్‌బీఐని సంప్రదించండి: అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం

Published on Sat, 03/01/2025 - 13:32

బ్యాంకులు ఖాతాలను 'ఎగవేత' లేదా 'మోసం'గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసే "కట్, కాపీ, పేస్ట్ పద్ధతి"పై శుక్రవారం బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన రుణ ఖాతాను 'మోసం'గా ప్రకటిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆర్‌బీఐని సంప్రదించాలని పారిశ్రామికవేత్త 'అనిల్ అంబానీ' (Anil Ambani)ని కోరింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 అక్టోబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రేవతి మోహితే డెరె, నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఆదేశాలు జారీ చేయడానికి ముందు తనకు ఎటువంటి విచారణకు అనుమతి ఇవ్వలేదని, బ్యాంక్ జారీ చేసిన రెండు షో-కాజ్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఈ ఆదేశాలను జారీ చేసేందుకు ఏ పత్రాలపై ఆధారపడ్డారో, వాటి నకళ్లు అడిగినా ఇవ్వలేదని తన పిటిషన్‌లో అనిల్‌ పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండా, బ్యాంకులు ఖాతాలను 'మోసం' లేదా 'ఉద్దేశపూర్వక ఎగవేత'గా ప్రకటించే కేసులు పదే పదే వస్తున్నాయని కోర్టు తెలిపింది. ఇలాంటి కట్, కాపీ, పేస్ట్ ఆర్డర్లు ఉండకూడదు. ఇది ప్రజాధనం. మనం అలాంటి ఆర్డర్లను అంత యాదృచ్ఛికంగా ఆమోదించకూడదు. దీనికోసం కొత్త వ్యవస్థను తీసుకురావాలని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా?

ఆర్‌బీఐ 'మాస్టర్ సర్క్యులర్'లలో ప్రచురించిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు తప్పకుండా గుర్తుంచుకోవాలని హైకోర్టు పేర్కొంది. బ్యాంకు అధికారులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చర్య తీసుకోకపోతే ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఆర్‌బీఐ కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మంచిది అని కోర్టు తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)