Breaking News

అంతా మీవల్లే.. రూ.50 కోట్లు ఇవ్వండి!.. టాలీవుడ్‌ హీరోయిన్‌

Published on Thu, 08/22/2024 - 14:47

ప్రముఖ నటి, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ 'రిమీ సేన్' తన కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న తర్వాత కారు తయారీదారుపై దావా వేసింది. ఇందులో భాగంగానే నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, సతీష్ మోటార్స్‌లకు నోటీసు పంపించడం కూడా జరిగింది.

నటికి ఇబ్బంది కలిగించిన కారు ఏదనేది స్పష్టంగా వెల్లడించలేదు. అయితే నోటీసును 'సుభమిత్ర సేన్' (రిమీ సేన్ అసలు పేరు) పేరుతో పంపించింది. రిమీ సేన్ 2022 ఆగష్టు 25న కారులోని రియర్ ఎండ్ కెమెరా పనిచేయకపోవడం వల్ల వెనుకవైపు నుంచి పిల్లర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే తన కారులోని సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత డీలర్‌షిప్లను దాదాపు 10 సార్లు సందర్శించింది. ఎన్ని సార్లు సర్వీస్ సెంటర్లను సందర్శించినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

తన కారులోని సమస్యలపై విసుగు చెందిన రిమీ సేన్ మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దీనికి పరిహారంగా రూ. 50 కోట్లు కోరుతూ డీలర్‌షిప్లకు, తయారీదారులకు లీగల్ నోటీసు పంపింది. అంతే కాకుండా చట్టపరమైన ఖర్చులను కవర్ చేయడానికి అదనంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరింది.

కార్ కంపెనీ, దాని సర్వీస్ పట్ల నేను పూర్తిగా నిరాశ చెందాను. కొన్ని సంస్థలు వినియోగదారుల పట్ల శ్రద్ద వహించడం లేదు. సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే నేను పిల్లర్‌ను ఢీ కొట్టాను. ఆ సమయంలో వెనుక మనిషి ఉంటే.. అది ఎంత పెద్ద నష్టాన్ని కలిగించేదో ఊహించవచ్చు. వారి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలితీసుకునేదని రిమీ సేన్ వెల్లడించింది. నాకు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు