Breaking News

17,000 మంది ఉద్యోగుల తొలగింపు!

Published on Fri, 11/15/2024 - 09:25

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్‌ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్‌ పీడియడ్‌లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.

కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్‌లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటామని చెప్పారు.  ఇటీవల సియాటెల్‌ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.

ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్‌ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం

ఇటీవల బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వివిధ విమానయాన సంస్థలకు అందించే 777 జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ 2026లో డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని అంచనా. దీనివల్ల సంస్థ షేర్స్ భారీగా క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరమని అధికారులు తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)