Breaking News

అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు

Published on Sun, 11/17/2024 - 19:21

అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్‌లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.

ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్‌లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్‌ ట్రాన్సిషన్‌ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.

సమ్మె ఎఫెక్ట్
సియాటెల్‌ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)