Breaking News

జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు

Published on Sun, 06/09/2024 - 18:55

ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్‌లైట్‌, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌ పొందుతుంది.

బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)