Breaking News

జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్: 310 మందికే ఈ బైక్!

Published on Fri, 09/26/2025 - 15:49

బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఇండియన్ మార్కెట్లో తన జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ (BMW G 310 RR Limited Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర స్టాండర్డ్ జీ 310 ఆర్ఆర్ కంటే కూడా రూ. 18000 తక్కువ. దీనిని 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే.. ఈ బైకును 310 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు.

భారతదేశంలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ 1000 యూనిట్లు అమ్ముడైన సందర్భంగా.. కంపెనీ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. ఫ్యూయెల్ ట్యాంక్ మీద 1/310 బ్యాడ్జ్ ఉండటం చూడవచ్చు. ఇది రెండు బేస్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది.

బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ 312 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9700 rpm వద్ద 34 bhp పవర్, 7700 rpm వద్ద 27.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. రైడ్-బై-వైర్ త్రాటిల్, రైడింగ్ మోడ్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కలర్ TFT డిస్ప్లే వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)