Breaking News

రూ.65 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు: పూర్తి వివరాలు

Published on Fri, 09/06/2024 - 12:37

బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు '320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో' లాంచ్ చేసింది. ఈ సెడాన్ ధర రూ.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్‌ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, గ్లోస్ బ్లాక్ రియర్ డిఫ్యూజర్‌ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్,  పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

కొత్త బీఎండబ్ల్యూ కారు మినరల్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, పోర్టిమావో బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. యాంబియంట్ లైటింగ్‌లో భాగంగా ఫ్రంట్ సీట్స్ వెనుక భాగంలో కొత్త ఇల్యూమినేటెడ్ కాంటౌర్ స్ట్రిప్‌ కూడా ఉంది.

బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 16 స్పీకర్‌లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

ఇదీ చదవండి: సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది

బీఎండబ్ల్యూ 320ఎల్‌డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందిన ఈ కారు 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)